ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏకపక్షంగా రాజధానిని మార్చాలనుకోవడం సరికాదు.. - ప్రకాశం జిల్లా ఒంగోలులో 8వ రోజు రైతుల దీక్షలు వార్తలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు వారు సైతం తమ మద్దతు తెలుపుతున్నారు. ఎవరిని సంప్రదించకుండా రాజధానిని మార్చాలనుకోవడం సరైనది కాదని వారు వ్యాఖ్యానించారు.

farmers protest capital city
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీక్షలు

By

Published : Jan 17, 2020, 5:54 PM IST

మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... ప్రకాశం జిల్లా ఒంగోలులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు దీక్షలో జిల్లాలోని రైతు సంఘ నేతలు పాల్గొని దీక్ష చేపట్టారు. పెద్ద ఎత్తున రైతులు దీక్ష స్థలికి చేరుకుని తమ అభిప్రాయాలు తెలియజేశారు. జగన్​ ఏకపక్షంగా రాజధానిని మార్చాలనుకోవడం సబబు కాదని వ్యాఖ్యానించారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేశారు.

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీక్షలు

ABOUT THE AUTHOR

...view details