ప్రకాశం జిల్లా పెద్దారవీడు తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. పురుగులమందు తాగిన ఆయన్ను....అక్కడున్నవారు వెంటనే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తండ్రి మృతి అనంతరం తన సోదరుడు, తాను స్థలాలు పంచుకున్నట్లు రైతు చెన్నయ్య వెల్లడించారు. అయితే తన భాగం ఆన్‌లైన్ చేయించాలంటూ ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదని బాధితుడు తెలిపాడు.
తహసీల్దార్ కార్యాలయంలో.. రైతు ఆత్మహత్యాయత్నం - famer suicide attempt at mro office
తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు బలవన్మరణానికి యత్నించాడు. భూమి ఆన్‌లైన్ కోసం ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదని.. పురుగుల మందు తాగాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
farmer