ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం పి.గుడిపాడుకు చెందిన నిమ్మగడ్డ లక్ష్మీనారాయణ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్పాలడ్డారు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణ ప్రాణాలు విడిచాడు. గ్రామంలో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని అందులో కూరగాయలు సాగు చేస్తున్నారు. నివర్ తుపానుతో పంటలు దెబ్బతిన్నాయి.
కూరగాయల సాగు కోసం చేసిన 4 లక్షలకు పైగా అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. వేసిన పంట చేతికి రాకపోవటం, తిరిగి సాగు చేసేందుకు రుణం దొరక్క.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులను తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎస్సై , ఏవో శ్రీనివాసరావులు కలిశారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులు తెలుసుకున్నారు. మేదమెట్ల ఎస్సై కట్టా అనూక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.