ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశం, రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు నియంతల్లా ప్రవర్తిస్తున్నారు: చింతా మెహన్​ - farmer mp chinta mohan on scholarship

రాష్ట్రంలో 80 వేల మంది మైనారీ విద్యార్థులకు రెండేళ్లుగా ఉపకార వేతనాలు(farmer mp chinta mohan on scholarship) అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. దేశం, రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు నియంతల్లా ప్రవర్తిస్తున్నారని(farmer mp chinta mohan on ycp) మండిపడ్డారు.

మాజీ ఎంపీ చింతా మోహన్
మాజీ ఎంపీ చింతా మోహన్

By

Published : Oct 12, 2021, 5:35 PM IST

దేశం, రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు నియంతల్లా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్(farmer mp chinta mohan) విమర్శించారు. అన్నిరకాల ధరలూ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సగటు మనిషి ఆదాయం మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్​లో సమస్యలపై మాట్లాడే ధైర్యం ఒక్క మంత్రికీ లేదని..కేబినెట్ అనుమతులు లేకుండా అన్ని రంగాలను ప్రదాని మోదీ(farmer mp chinta mohan comments on mp modi) ప్రైవేట్ పరం చేస్తున్నాడని చింతా మోహన్ మండిపడ్డాడు. మోదీ నాయకత్వంలో ఇండియా ఫర్ సెల్​గా మారిందని.. పేదవాడికి పట్టేడు అన్నం పెట్టలేని ప్రధాని రూ. 8 వేల కోట్లతో విమానంలో తిరుగుతున్నాడని అన్నారు.

రాష్ట్రంలో 80 వేల మంది మైనార్టీ విద్యార్థులకు రెండు సంవత్సరాలుగా స్కాలర్ షిప్​లు లేక తీవ్ర ఇబ్బందులు(farmer mp chinta mohan on scholarship) ఎదుర్కొంటున్నారని.. నవారంధ్రాలు మూతపడే విధంగా నవరత్నాల పథకాలను సీఎం జగన్​ అమలు చేస్తున్నాడని విమర్శించారు. వేల కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుబడితే ఆ పారిశ్రామికవేత్తను ఎందుకు అరెస్టు చెయ్యలేదో చెప్పాలన్నారు. త్వరలో రాష్ట్రం అంధకార ఆంధ్రప్రదేశ్​గా మారబోతుందని.. రాష్ట్రంలో ఏప్రిల్ తరువాత రైతులకు ఉచిత విద్యుత్ ఉండబోదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details