ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు షేక్ కాశీం అనే రైతు మృతి చెందాడు. వర్షం కురుస్తున్న సమయంలో సీతారాంపురం గ్రామానికి చెందిన షేక్ఖాశీం పీరా అనే రైతు మల్లె తోటలో పనుల నిమిత్తం వెళ్లాడు. అదే సమయంలో పెద్ద శబ్దంతో కూడిన పిడుగు అతనికి సమీపంలో పడటంతో కాశీం స్పృహ తప్పి పడిపోయాడు. అది గమనించిన సమీప పొలాల్లోని రైతులు.. అప్రమత్తమై హుటాహుటిన వైద్యం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలున్నారు.
హనుమంతునిపాడులో పిడుగుపాటుకు రైతు మృతి - ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో పిడుగుపాటుకు ఓ రైతు మృతి చెందాడు. మల్లె తోటలో పని నిమిత్తం వెళ్లగా అతనికి సమీపంలో పిడుగు పడటంతో స్పృహ కోల్పోయాడు.
హనుమంతునిపాడులో పిడుగుపాటుకు రైతు మృతి
ఇదీ చదవండి: