ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట వెంకటనరసయ్య అనే రైతు కుటుంబం పెట్రోల్ సీసాతో ఆందోళనకు దిగింది. జిల్లాలోని తోకపల్లిలో తమకున్న ఐదెకరాల భూమిని కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని మరొకరికి కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని.. కబ్జాకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
FARMER PROTEST: తన భూమిని కబ్జా నుంచి కాపాడాలని రైతు నిరసన - ప్రకాశం జిల్లా వార్తలు
తన వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారంటూ ఓ రైతు కుటుంబం నిరసన చేపట్టింది. అందుకు సహకరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
FARMER PROTEST