ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటమునిగిన పంట...ఆగిన రైతు గుండె - Farmer dies of heart attack in Prakasam district Inkollu

ఆరు లక్షలు అప్పుచేసి ఓ రైతు మిరపను సాగు చేస్తున్నాడు. ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంట తుపాను ప్రభావంతో వర్షానికి నీట మునిగింది. అది చూసి రైతుకు కన్నీళ్లు ఆగలేదు. నీటిని తోడి పంటను రక్షించుకోవాలని తాపత్రయ పడ్డాడు. పనిలో మునిగాడు. ఆ ప్రయత్నమే ఆయన గుండె చప్పుడును ఆపేసింది. అతని కుటుంబానికి తీరని విషాదాన్ని నింపింది.

farmer-dies
ఆగిన రైతు గుండె

By

Published : Nov 28, 2020, 2:01 AM IST

ప్రకాశం జిల్లా ఇంకోల్లు మండలం భీమవరంలో నీటమునిగిన మిర్చి పంటను చూసి గుండె పోటుతో రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన రాజోలు పెద్ద యోగయ్య(38) అనే రైతు నాలుగున్నర ఎకరాలల్లో మిర్చి పంటను వేసి సాగు చేస్తున్నాడు. నివర్ తుపాను కారణంగా కురుస్తున్న వర్షానికి పంట నీటమునిగింది. రోజు మాదిరిగానే పొలానికి వెళ్ళిన రైతు అది చూసి ఆందోళనకు గురయ్యాడు. నీటినితోడి బయటకు పారపోస్తుండగా ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

అప్పు తీర్చలేననే మనస్తాపం

మిర్చి పంట వేసేందుకు రూ.6లక్షల వరకు అప్పుచేశాడని వాటిని తీర్చలేనన్న మనస్థాపానికి గురై గుండెపోటుతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ABOUT THE AUTHOR

...view details