ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RED MANGO: మీరెప్పుడైనా రెడ్ మ్యాంగో చూశారా.. ధర ఎంతో తెలుసా..! - మీరు ఎప్పుడైనా రెడ్ మ్యాంగో చూశారా

RED MANGO: ఎక్కువ మందికి మామిడిపండ్లు అనగానే పసుపుపచ్చ రంగులో ఉండే బంగినపల్లి గుర్తుకు వస్తాయి. కానీ ఇక్కడ ఉన్న మామిడి మాత్రం ఎర్రటి రంగులో ఉంది. అంతేకాదండోయ్​ అచ్చం కశ్మీర్ యాపిల్​ను పోలి ఉంటుంది. దీనిలో ఉన్న మరో విశేషం ఏంటంటే షుగర్ కంటెంట్ తక్కువ ఉండి.. ఫైబర్ అధిక శాతంలో ఉంటుంది. అలాగే బహిరంగ మార్కెట్​లో దీని ధర కూడా ఎక్కువే.. దీనిని ప్రకాశం జిల్లాకు చెందిన రైతు పండిస్తున్నాడు.

RED MANGO
మీరు ఎప్పుడైనా రెడ్ మ్యాంగో చూశారా.. మార్కెట్లో దాని ధర కూడా ఎక్కువే..!

By

Published : Jun 3, 2022, 4:41 PM IST

మీరు ఎప్పుడైనా రెడ్ మ్యాంగో చూశారా.. మార్కెట్లో దాని ధర కూడా ఎక్కువే..!

RED MANGO: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే రైతు వినూత్నమైన మామిడి రకాన్ని సాగు చేస్తున్నారు. జపాన్ దేశానికి చెందిన రెడ్ మ్యాంగో మామిడిపండ్ల రకాన్ని సాగు చేస్తూ.. మిగతా రైతులను ఆకర్షిస్తున్నారు. మామిడి చెట్ల సేకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని నర్సాపూర్​ నర్సరీలో రెడ్ మ్యాంగో మామిడి రకాన్ని చూసి ఆసక్తితో కొన్ని మొక్కలు తీసుకువచ్చి తన పొలంలో నాటారు. కొన్ని సంవత్సరాల తర్వాత రెడ్ మ్యాంగో కోత దశకు వచ్చింది. ఒక్కో చెట్టుకు 25 నుంచి 30 కేజీలు దిగుబడి వస్తూ ఉండటంతో మంచి లాభాలు వస్తున్నాయని వెంటేశ్వరరావు అంటున్నారు.

ఈ మామిడి పండ్లను సాగు చేసే సమయంలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించలేదని, కేవలం గోపంచకం, ఆవు పేడను ఎరువుగా మార్చి పంటను సాగు చేశామని తెలిపారు. బహిరంగ మార్కెట్లలో రెడ్ మ్యాంగో ధర కేజీ రూ.500 నుంచి 1000 రూపాయలకు పైగా ఉంటుందని.. భవిష్యత్తులో ఈ పంట దిగుబడి మరింత పెంచేందుకు కృషి చేస్తున్నానని వెల్లడించారు. బీకాం చదివిన వెంకటేశ్వరరావు వ్యవసాయంపై మక్కువ తో ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు చేయడంపై స్థానిక రైతులు అభినందిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details