ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్ల సొమ్ములో నకిలీ నోట్లు.. ఎక్కడంటే..! - pensionslo donga notlu

Fake Notes: పింఛన్ల పంపిణీ సమయంలో నకిలీ నోట్లు రావడంతో ప్రజలు షాక్ అయ్యారు. వెంటనే వాలంటీరుకు సమాచారం ఇవ్వగా.. వాటిని పరిశీలించారు. ఇలా మొత్తం ఎవరెవరి దగ్గర ఉన్నాయో.. వాళ్లందరి దగ్గర నుంచీ వాటిని తిరిగి తీసుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో చోటు చేసుకుంది. మొత్తం 38 నోట్లను గుర్తించారు.

Fake notes
నకిలీ నోట్లు

By

Published : Jan 1, 2023, 12:32 PM IST

Updated : Jan 1, 2023, 12:57 PM IST

Fake Notes in Pension Distribution: పేదలకు పంపిణీ చేసిన పింఛన్ల సొమ్ములో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఎస్సీ కాలనీలో వాలంటీరు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఓ లబ్ధిదారు పింఛను నగదుతో లావాదేవీ చేస్తుండగా నకిలీ నోటు గుర్తించారు. ఈ విషయాన్ని వాలంటీరు దృష్టికి తీసుకురాగా.. పంపిణీ సొమ్ములో మరికొన్ని నకిలీ నోట్లు కనిపించాయి. పింఛన్ల నగదులో 500 రూపాయల నకిలీ నోట్లు 38 వరకూ గుర్తించారు. వీటిని తిరిగి తీసుకున్న వాలంటీరు.. అధికారులకు అప్పగించారు.

పింఛన్ల పంపిణీలో నకిలీ నోట్లు

"మేము ప్రతి నెలా చివరిలో బ్యాంక్​కి వెళ్లి పింఛను డబ్బు తీసుకొని వాస్తాం. తరువాత వాలంటీర్లను పిలిపించి.. వారి పింఛన్ల లిస్ట్ చూసి.. పంపిణీ చేస్తాం. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి పింఛను పంపిణీ మొదలు పెట్టారు. నాకు 7 గంటలకు ఫోన్ వచ్చింది. అధికారులమంతా వచ్చాం. మొత్తం 38 నోట్లు.. 19 వేల రూపాయలు ఫేక్ నోట్లు వచ్చాయి". - వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి

"నేను తెల్లవారే సరికి పింఛన్లు ఇచ్చేశాను. తెల్లవారిన తరువాత.. ఇవి దొంగనోట్లు అని పింఛను తీసుకున్నవారు చెప్పారు. నేను వాటిని పరిశీలించి.. అధికారులకు సమాచారం ఇచ్చాను. వాళ్లు వచ్చి వాటిని తీసుకువెళ్లారు". - వాలంటీరు

ఇవీ చదవండి:

Last Updated : Jan 1, 2023, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details