ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడు సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఎక్సైజ్ అధికారులమంటూ హల్చల్ చేశారు. వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తూ గందరగోళం సృష్టించారు. వారు మద్యం సేవించి ఉండటంతో అనుమానం వచ్చి వాహనదారులు నిలదీశారు. గుర్తింపు కార్డులు చూపించాలంటూ ప్రశ్నించారు. నకిలీ అధికారులు ఆగ్రహంతో దాడికి ప్రయత్నించారు. సమీపంలోని రైతులు పరుగున వచ్చి అధికారులు అయితే మీకు భయం ఎందుకు అంటూ గట్టిగా నిలదీశారు. దీంతో వారిద్దరూ కార్లో పరారయ్యారు. ఈ అంశంపై కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
నకిలీ ఎక్సైజ్ అధికారుల హల్చల్... పట్టించిన మద్యం - fake police at prakasham district
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడు సమీపంలో ఇద్దరు వ్యక్తులు.. ఎక్సైజ్ అధికారులమని వాహనాలు తనిఖీ చేస్తూ హల్చల్ చేశారు.
నకిలీ ఎక్సైజ్ అధికారుల హల్ చల్