ప్రకాశం జిల్లా చీరాలలోని వైకుంఠపురం బాలసాయినగర్లో ఓ ఇంట్లో దొంగనోట్లు ముద్రిస్తున్నారన్న సమాచారంతో... పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో దొంగనోట్లు తయారు చేస్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుల నుంచి కంఫ్యూటర్, ప్రింటర్, గాంధీ బొమ్మతో ఉన్న అచ్చులు, రంగుసీసాలు, స్క్రీన్ ప్రింటింగ్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దొంగనోట్ల ముద్రణ... ఆరుగురు అరెస్టు - chirala crime news
దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాను ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి కంఫ్యూటర్, ప్రింటర్, అచ్చులు, రంగులు, స్క్రీన్ ప్రింట్‌కు అవసరమైన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నకిలినోట్లు ముద్రిస్తున్న సభ్యుల ముఠాలో వైకుంఠపురానికి చెందిన కాకి అన్నపూర్ణ, పేరాలకు చెందిన మాచర్ల మధుసూధనరావు, సోమ ఈశ్వరరావు, సోమ మురళీకృష్ణ, మంగళగిరికి చెందిన జల్లా శివప్రసాద్, జల్లా కిరణ్ అనే ఆరుగురుని అరెస్టు చేసినట్లు చీరాల డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. డబ్బు సులువుగా సంపాదించవచ్చనే ఉద్దేశంతో నకిలీ నోట్లు ముద్రిస్తున్నారని, సాంకేతికతను ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ అన్నారు. దాడుల్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని డిఎస్పీ శ్రీకాంత్ అభినందించారు.
ఇదీచదవండి.