Fake Cards in the Name of Land Lease in Prakasam District:వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అక్రమాలు విపరీకంగా పెరిగిపోయాయి అనడానికి ఎలంటి సందేహం లేదు. అధికారం అండతో కొంత మంది చోటా నాయకులు భూములను కౌలుకు తీసుకున్నట్లు నకిలీ కార్డులు సృష్టించి, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని అక్రమంగా దోచేస్తున్నారు. మన పొలాలు మనదగ్గరే ఉన్నాయి కదా మనమే సాగు చేసుకుంటున్నాం కదా అనుకున్న రైతులకు ఈ నకిలీ కౌలు రైతులు బాగోతం ఖంగుతినిపిస్తుంది. కోట్ల రూపాయలు కుంభకోణానికి తెరలేపడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వాలంటీర్లు, అధికార పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు ఈ తంతంగాన్ని నడిపినట్లు తెలుస్తోంది.
ప్రశ్నిస్తే 'దుస్తులూడదీసి కొడతాం' - సామాన్యుల ఆస్థులు ఆక్రమిస్తూ వైసీపీ నాయకుల బెదిరింపులు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరుకూరు, పెరికిపాలెం, నాగిరెడ్డి పాలెం, తిమ్మాపాలెం, పెంకుపాలెం, తదితర గ్రామాల్లో రైతులు పొగాకు, మిరప, మినుము తదితర పంటలు సాగుచేసుకుంటారు. భూ యజమానులే కాకుండా ఉద్యోగ రీత్యా విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి పొలాలు కూడా వారి సమీప బంధువులే సాగు చేస్తుంటారు. అన్నదమ్ములో, తల్లిదండ్రులో తమకు నచ్చిన పంటవేసుకొని అంతో ఇంతో ఆర్థికంగా లాభపడుతుంటారు. అంటే దాదాపు అందరూ సొంత రైతులు క్రిందే లెక్క కౌలుకు ఇచ్చేది బహు స్వల్పం అయితే గ్రామంలో ఇటీవల బయటపడిన ఓ జాబితా చూసి భూ యజమానులు ఖంగుతున్నారు. వారి భూమిలో కొంత కౌలుకు ఇచ్చినట్లు కౌలు కార్డు పుట్టించారు. ఆ కార్డు ద్వారా ప్రభుత్వానికి పిఎమ్ రైతు బరోసా, క్రాప్ ఇన్సూరెన్సు వంటివి పొందినట్లు జాబితాలో ఉంది.
భూమిని ఆక్రమించిన వైసీపీ శ్రేణులు - సీఎం జగన్ చేతుల మీదుగా అధికారికంగా పంపిణీ
పలు గ్రామాల్లో దాదాపు 450 మంది రైతులకు సంబంధించిన కౌలు కార్డులు సృష్టించినట్లు తెలుస్తోంది. గత రెండు మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి వచ్చే నగదు ఇలా నకిలీ కౌలు కార్డుదారుల ఎకౌంట్లలోకి వెళ్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కో కౌలు దారుడునికి యూనిట్‌గా తాసుకొని 13 వేల 500 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఒక భూయజమానికి 5, 10 ఎకరాలు ఉంటే, అందులో 2, 3 ఎకరాలు కౌలుకు ఇచ్చినట్లు చూపిస్తున్నారు. జాబితాలో కౌలు దారులు పేర్లు చూస్తే, ఒక్కటికూడా తమ గ్రామానికి చెందినవారు గానీ, తెలిసిన పేర్లుగానీ ఉండటంలేదు. ఈ వ్యవహారం అంతా కొంతమంది వాలంటీర్లు, అధికార పార్టీకి చెందిన చోటా నాయకుడు, కొంతమంది రెవెన్యూ, వ్యవసాయ అధికారులు ప్రమేయం ఉన్నట్లు ఉంది.
YCP Leaders Land irregularities in Visakhapatnam: విశాఖలో వైసీపీ నేతల భూ అక్రమాలు.. చివరకి పేదల భూములనూ వదలటం లేదు..
చినబ్బాయి అనే వాలంటీర్ తన పేరుమీద, తన కుంటుంబ సభ్యుల మీద కార్డులు పుట్టించుకున్నాడు. అదే విధంగా 5,6 ఏళ్ళ క్రితం మరణించిన రైతులు కూడా కౌలుకిచ్చినట్లు జాబితాలో పేర్కొన్నారు. వీఆర్వో పాస్‌వర్డ్ వేరేవారి దగ్గరకు వెళ్లడంతో ఈ తతంగం నడిపినట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును కౌలు తీసుకోకుండానే, సాగు చేయకుండానే బినామీ వ్యక్తులు లాభం పొందారు. వాస్తవానికి అసలు యజమాని పొలం పరిశీలిస్తే, పొగాకో, మరే పంటో ఉంటే, నకిలీ కౌలు రైతు మరో పంట వేసినట్లు చూపించుకున్నారు.
క్షేత్ర పరిశీలన చేయకుండానే పంటనమోదు చేసినట్లు తెలుస్తోంది. తమకు మాత్రం ఎలాంటి ప్రతిఫలాలు రావడంలేదని , నకిలీ కౌలు రైతులపేరున మాత్రం కోట్ల రూపాయలు పక్కతోవపట్టించారని రైతుల వాపోతున్నారు. కోట్ల రూపాయలు పక్కతోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని, నిధులు రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్‌కు కొండెపి ఎమ్మెల్యే పిర్యాదు చేసారు. నకిలీ కౌలు కార్డులు కుంభకోణాన్ని వెలికి తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.