ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కుంకుపాడు వద్ద ఇసుక రవాణా చలానాలో పేర్లు మారుస్తూ నకిలీ బిల్లులు ఇస్తున్న యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారం రోజులుగా ఈ తంతు జరుగుతున్నట్లు ఫిర్యాదు అందుకున్న ఎక్సైజ్ పోలీసులు రంగంలోకి దిగి శ్రీకాంత్ అనే యువకున్ని అరెస్ట్ చేశారు. నకలీ బిల్లులతో ఇసుక తరలిస్తున్న 6 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే వాహనాల యజమానులు తాము డబ్బు చెల్లించే ఇసుక తరలిస్తున్నామని.. అవి ప్రభుత్వానికి చేరకుండా అక్రమార్కులు నకిలీ బిల్లులతో లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి తెలిపారు.