ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలుమగలే హంతకులు! - chinajangama

2018 నవంబరు జరిగిన మహిళ కేసులో వీడిన మిస్టరీ. వివాహేతర సంబంధమే మహిళ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

ఆలుమగలే హంతకులు

By

Published : Feb 16, 2019, 7:29 AM IST

ఆలుమగలే హంతకులు!
వివాహిత హత్యకేసులో ప్రకాశం జిల్లా చిన్నగంజాం పోలీసులు..గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన భార్యభర్తలను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం కారణంగా మహిళను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. బాపట్లకు చెందిన ఏసు రక్షణకు విజయకుమారి అనే మహిళకు మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఏసు రక్షణ, ఆయన భార్య రోజారాణి మధ్య తరచూ గొడవపడుతుండేవారు. విజయకుమారి వివాహేతర సంబంధం కొనసాగించాలని పట్టుబట్టిందని అందుకే హత్య చేశామని ఏసు రక్షణ-రోజారాణి ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details