ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. చనిపోయిన మూగజీవాల కళేబరాలతో వ్యాపారం చేస్తున్నాడు. ఇందుకోసం జబ్బుచేసి లేక మరో విధంగా మృతి చెందిన జంతు కళేబరాలను కొనుగోలు చేస్తాడు. వాటిని ముక్కలుగా చేసి కొన్ని రసాయనాలతో శుద్ధి చేస్తాడు. ఆ మాంసాన్ని ఐస్ బాక్సుల్లో అమర్చి పట్టణాలకు ఎగుమతి చేస్తున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వ్యాపారం నిర్వహించే వ్యక్తి తనకున్న ఎకరా పొలంలో చిన్నపాటి రేకుల షెడ్ వేసి చుట్టూ ఏపుగా పశుగ్రాసాన్ని పెంచాడు. చనిపోయిన జంతువుల వివరాలు సేకరించి, తన అడ్డాకి తరలించి మాంసం ఎగుమతి చేస్తున్నాడని స్థానికులు అంటున్నారు. పూరిమెట్ల నుంచి మారేళ్ల వెళ్లే రహదారి పక్కనే ఈ మాంసం కేంద్రం ఉండటం వలన మిగులు వ్యర్ధాలతో దాదాపు కిలోమీటరు వరకు దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు అంటున్నారు.