ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. - ఆగ్ని ప్రమాదం తాజా వార్తలు

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో టిఫిన్ సెంటర్​లో గ్యాస్​ సిలిండర్​ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పక్కనే ఉన్న మందులు దుకాణం లోకి వ్యాపించడం సుమారు ఐదు లక్షలు మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Exploding gas cylinder
గ్యాస్​ సిలిండర్​ పేలి అగ్ని ప్రమాదం

By

Published : May 24, 2020, 10:55 AM IST

టిఫిన్ సెంటర్​లో గ్యాస్ లీకై వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో జరిగింది. గ్రామంలోని బొద్దికూరపాడు బస్టాండ్ సెంటర్​లో పరమేశ్వర టిఫిన్ సెంటర్​లో ఉదయం అల్పాహారాలు తయారు చేస్తున్న క్రమంలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. గమనించిన నిర్వాహకులు బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించనప్పటికీ హోటల్​కు ఆనుకొని ఉన్న మందుల దుకాణంలోకి మంటలు వ్యాపించాయి. ఐదు లక్షల విలువైన మందులు, చరవాణులు, జిరాక్స్ మిషన్, ఇతర వస్తువులు కాలిపోయాయి. దర్శి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details