ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిహారం రాలేదని ఆత్మహత్యాయత్నం.. వెలిగొండ నిర్వాసితుడు మృతి! - వెలిగొండ నిర్వాసితుడు మృతి

వెలిగొండ నిర్వాసితుడు మాధవరావు(55) ఒంగోలు రిమ్స్​లో మృతి చెందారు. ఈ నెల 4వతేదీన పురుగుల మందు తాగిన మాధవరావు దంపతులు అప్పటినుంచి రిమ్స్​లో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితమే ఆయన భార్య కన్నుమూశారు.

expatriate died in ongole rims
expatriate died in ongole rims

By

Published : Nov 10, 2021, 7:24 AM IST

ఒంగోలు రిమ్స్‌లో వెలిగొండ నిర్వాసితుడు మాధవరావు(55) మృతి చెందారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపులో వారు భూములు కోల్పోయారు. కానీ.. ప్యాకేజీ కింద పరిహారం రాలేదని అర్ధవీడు మం.సాయిరాం నగర్‌కు చెందిన మాధవరావు దంపతులు ఈ నెల 4వ తేదీన పురుగులమందు తాగారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్సపొందుతున్నారు. చికిత్స పొందుతూనే మాధవరావు భార్య కృష్ణకుమారి.. నాలుగు రోజుల క్రితం మృతి చెందారు. తాజాగా.. మాధవరావు ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details