ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు.. 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - నాటుసారా స్దావరాలపై ఎక్సైజ్ పోలీసులుదాడులు

ప్రకాశం జిల్లా చీరాల మండలం రామ్ నగర్​లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.

EXCISE POLICE RAIDS
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు

By

Published : Dec 17, 2019, 11:05 PM IST

Updated : Dec 19, 2019, 7:54 AM IST

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు

నాటుసారా స్దావరాలపై ఎక్సైజ్ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామనగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసులు నాటు సారా తయారీ, విక్రయ స్థావరాలపై దాడులు చేశారు. భూమిలో పాతి పెట్టి ఉంచిన 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారాయి తయారికీ వాడే కరక్కాయిలు, 5 కిలోల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీపై గట్టి నిఘాపెట్టామని.. దీన్ని అణిచివేయటమే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని చీరాల ఎక్సైజ్ సీఐ రమేష్ చెప్పారు. నాటుసారా తయారు చేసినా, అమ్మినా నిందితులకు 2 లక్షల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించేలా చేసిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందన్నారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు... విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తామని తెలిపారు.

Last Updated : Dec 19, 2019, 7:54 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details