ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఎక్సైజ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా పట్టణం నుంచి మేదరమెట్ల వైపు వెళ్తుండగా కొంగపాడు డొంక వద్ద 18 మద్యం సీసాలు, ఓ ద్విచక్ర వాహనానాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.
అద్దంకిలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.. మద్యం సీసాలు స్వాధీనం - prakasam district latest news
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఎక్సైజ్ అధికారులు చేపట్టిన విస్తృత తనిఖీల్లో 18 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
![అద్దంకిలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.. మద్యం సీసాలు స్వాధీనం seized liquor bottles at addanki](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:30:21:1621245621-ap-ong-61-17-addanki-madhayam-pattivatha-av-ap10067-17052021150349-1705f-1621244029-501.jpg)
అద్దంకి పట్టణంలో విస్తృత తనిఖీలు