ఎక్సైజ్ సిబ్బంది దాడులు.. 1300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - చీరాలలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు
ప్రకాశం జిల్లా కావూరిపాలెం శివారులోని తులసినగర్ వద్ద నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. 13 వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
![ఎక్సైజ్ సిబ్బంది దాడులు.. 1300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం excise officers raid on cheap liquor centres at chirala prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6696875-1101-6696875-1586263896500.jpg)
నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు.. 13వందల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
కరోనా వైరస్ భయంతో ప్రజలు అల్లాడుతుంటే.. కొందరు మాత్రం యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం కావూరిపాలెం శివారులోని తులసినగర్ వద్ద నాటు సారా తయారీపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ సిబ్బంది.. మెరుపుదాడులు చేశారు. 1300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తయారుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.