ఇదీ చూడండి:
నకిలీ మద్యం దుకాణంపై ఎక్సైజ్ అధికారుల దాడి - latest news of nakili madyam
ప్రకాశం జిల్లా అద్దంకిలో నకిలీ మద్యం కేంద్రంపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. పై అధికారుల నుంచి వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది 175 లీటర్ల స్పిరిట్, 128 నకిలీ మద్యం సీసాలు, నకిలీ పురుగుల మందు స్వాధీనం చేసుకున్నారు. దుకాణ నిర్వాహకుడు రావూరి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేంద్రం నుంచి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వీటి విలువ లక్ష రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.
నకిలీ మద్యం దుకాణంపై ఎక్సైజ్ అధికారుల దాడి
TAGGED:
latest news of nakili madyam