రాజధాని అమరావతి కోసం ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే నిర్వహించ తలపెట్టిన బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ... ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తన ఇంటి వెనుక నుంచి బైక్ ర్యాలీకి బయలుదేరారు. ఎక్కడిక్కడ పోలీసులను తప్పుదారి పట్టిస్తూ పట్టణంలో ర్యాలీ చేశారు. ఎమ్మెల్యే అనుచరులు సైతం రోడ్ల పైకి వచ్చి ర్యాలీ నిర్వహించారు. చివరకూ.. ఓ ప్రదేశంలో దామచర్లను పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీనిని మహిళలు అడ్డుకున్నారు. అతి కష్టం మీద ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
పోలీసుల కళ్లుగప్పి మాజీ ఎమ్మెల్యే దామచర్ల బైక్ ర్యాలీ - ex mla damacharla janardhan bike rally
ప్రకాశం జిల్లా ఒంగోలులో రాజధాని కోసం మాజీ ఎమ్మెల్యే తలపెట్టిన బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ... పోలీసుల కళ్లుగప్పి దామచర్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
![పోలీసుల కళ్లుగప్పి మాజీ ఎమ్మెల్యే దామచర్ల బైక్ ర్యాలీ ex mla bike rally in ongole for amaravathi capital issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5662838-231-5662838-1578653384361.jpg)
పోలీసుల నుంచి తప్పించుకని బైక్ ర్యాలీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్
పోలీసుల నుంచి తప్పించుకని బైక్ ర్యాలీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్