ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వచ్చే ఎన్నికల్లో నాకు సీటు లేకపోవచ్చు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు - వైసీపీ ఎమ్యెల్యే బాలినేని సంచలన వ్యాఖ్యలు

Balineni Srinivasa Reddy Sensational Comments: వైసీపీ ఎమ్యెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవచ్చని అన్నారు. సీఎం మహిళలకే ప్రాధాన్యత అంటే..నేనైనా తప్పుకోక తప్పదని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు పార్టీ గెలుపు కోసం పని చేయాలని పేర్కొన్నారు.

Balineni Srinivasa Reddy
బాలినేని శ్రీనివాసరెడ్డి

By

Published : Jan 23, 2023, 9:47 PM IST

Balineni Srinivasa Reddy Sensational Comments: వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాకపోవచ్చు అంటూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌.. నీకు సీటు లేదు.. నీ భార్య సచీదేవికి ఇస్తామన్నా చేసేదేమీ లేదని బాలినేని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు సీఎం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్న బాలినేని.. మహిళలే అంటే నేనైనా తప్పుకోక తప్పదని స్పష్టం చేశారు. అదేవిధంగా నియోజకవర్గ నేతలు పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేయాలని సూచించారు. సింగరాయకొండ మార్కెట్ యార్డు ఛైర్మన్‌ ప్రమాణస్వీకార సభలో పాల్గొన్న బాలినేని పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details