ప్రకాశం జిల్లా మార్కాపురంలో చిక్కుకున్న ఒడిశా విద్యార్థులంతా ఎట్టకేలకు స్వస్థలాలకు బయల్దేరారు. ఇంటికి తిరిగి వెళ్తున్నామన్న వారి ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా వారు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరి కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. బీఈడీ పరీక్షలు రాసేందుకు ఒడిశా విద్యార్థులు ఈనెల 14న మార్కాపురం వచ్చారు. అయితే వారు మళ్లీ తిరిగి వెళ్లే సమయానికి కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఫలితంగా ఎక్కడికక్కడ ప్రజారవాణా స్తంభించటంతో విద్యార్థులంతా మార్కాపురంలోనే ఓ గదిలో ఉండిపోయారు. గత నాలుగు రోజులుగా సరిగా భోజనం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి దృష్టికి వెళ్లింది. స్పందించిన ఆయన ఒడిశా, ప్రకాశం జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అనంతరం వారు తిరిగి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులంతా ఆనందంతో స్వస్థలాలకు తరలివెళ్లారు.
రాష్ట్రంలో చిక్కుకున్న ఒడిశా విద్యార్థులు.. చివరికి ఎలా ఇళ్లకు చేరారంటే..! - Odisha students stuck in Markapuram
లాక్డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో ఎక్కడి ప్రజారవాణా అక్కడే నిలిచిపోయింది. పక్క పట్టణంలోకి వెళ్లాలన్నా కుదరని పరిస్థితి. అలాంటిది వేల కిలోమీటర్ల దూరంలోని పక్క రాష్ట్రం వాళ్లు చిక్కుకుపోతే.. వారి పరిస్థితి ఏంటి? ప్రకాశం జిల్లా మార్కాపురాని బీఈడీ పరీక్ష రాసేందుకు వచ్చిన ఒడిశా విద్యార్థులకు ఇదే అనుభవం ఎదురైంది. లాక్ డౌన్ తో మార్కాపురంలోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది. కానీ.. చివరికి వాళ్లు జాగ్రత్తగా ఇళ్లకు చేరేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అధికారులు, పోలీసులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
చిక్కుకున్న ఒడిశా విద్యార్థులను స్వస్థలాలకు తరలింపు