1985లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు హయాంలో ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాశీపురం వద్ద మూసివాగుపై ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఐదు గ్రామాలలోని 625 ఎకరాలకు సాగునీరు అందించారు. ఈ పథకం నిర్మాణం చేపట్టక ముందు స్థానికులు వలస వెళ్లేవారు. పథకం అందుబాటులోకి వచ్చాక వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ సమయంలో పైపులైన్ల లీకేజీ సమస్య తలెత్తి ఎత్తిపోతల పథకం వినియోగంలోకి లేకుండా పోయింది. అప్పటినుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా... ఎవరూ ఈ పథకాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.
కోట్ల ఖర్చుతో నిర్మించారు... పర్యవేక్షణ మరిచారు - ethipothala scheme in prakasham district news
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాశీపురం వద్ద మూసివాగుపై 1985వ సంవత్సరంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అయిదు సంవత్సరాలు పనిచేసిన అనంతరం.... పైపులైన్ల లీకేజీ సమస్యలు, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పథకం మూతపడింది.
ఉపయోగంలో లేని ఎత్తిపోతల పథకం
2018లో స్థానిక ఎమ్మెల్యే చొరవతో రూ. 3.20 కోట్ల నిధులతో... పునర్నిర్మాణ పనులు చేపట్టారు. అయతే పర్యవేక్షణ మరవటంతో పథకం మూతపడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, మూసీ వాగుపై చెక్ డ్యాం నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీచదవండి.