ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ స్తంభంతో సహా కూలిన భారీ ఫ్లెక్సీ - మార్టూరులో కూలిన విద్యుత్ స్తంభం

ఈదురుగాలులకు ఫ్లెక్సీతోపాటు విద్యుత్ స్తంభమూ కూలిపోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరు జాతీయ రహదారి జరిగింది. సిబ్బంది వచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసి.. వాటిని తొలగించారు. ఆదివారం, దసరా సెలవు కావడంతో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

flexi accident in marturu
మార్టూరులో ఫ్లెక్సీ ప్రమాదం

By

Published : Oct 26, 2020, 7:37 AM IST

ఈదురు గాలులకు ఫ్లెక్సీతో పాటు దాన్ని కట్టిన విద్యుత్ స్తంభమూ కూలిపోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరులోని 16వ నెంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వాహనదారుల సమాచారం మేరకు సిబ్బంది వచ్చి.. ఆ స్తంభానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాదానికి కారణమైన ఫ్లెక్సీని తొలగించారు.

తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల ప్రక్కన అధికారపార్టీకి చెందిన నాయకుల భారీ ఫ్లెక్సీ కొందరు ఏర్పాటు చేశారు. అది పడిపోకుండా.. విద్యుత్ స్తంభానికి కర్రలతో కలిపి కట్టారు. వర్షాలు, గాలులకు అదికాస్తా పడిపోయింది. ఆదివారం, దసరా సెలవురోజు కావడంతో.. జనసంచారం అంతగా లేక పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారి పక్కన ఫ్లెక్సీలను తొలగించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details