చినముంబయిగా ప్రసిద్ది చెందిన చీరాల నియోజకవర్గంలోని పురపాలక సంఘాన్ని మినహాయిస్తే 25 పంచాయతీలున్నాయి. వీటిల్లో చీరాల 15, వేటపాలెం మండలం 9 ఉన్నాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేవలం వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీకి మాత్రమే ఎన్నికలు జరగుతున్నాయి.
ఎన్నికలు నిలిచిన కొత్తపేట గ్రామ పంచాయతీ ఇదీ కారణం..
2019 డిసెంబరులో రెండు మండలాల్లో ఉన్న పంచాయతీలను పునర్విభజన చేసి మరో 5 పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిల్లో వేటపాలెం మండలంలో కొణిజేటి చేనేతపురి, వైఎస్సార్ పంచాయతీ, లక్ష్మీపురం పంచాయతీలను కొత్తగా ప్రతిపాదించారు.
● చీరాల మండలంలో పంచాయతీలో ఉన్న బోయినవారిపాలెం, సాయికాలనీలను ఏర్పాటు చేశారు. అయితే పునర్విభజన చేసే సమయంలో ముందుగా ఆయా పంచాయతీల్లో గ్రామసభలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆరోజున అధికారులు దీన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయ నాయకుల ఒత్తిడితోనే ఇలా చేశారని కొత్తపేటకు చెందిన పలువురు కలెక్టరుకి ఫిర్యాదు చేశారు. ప్రజాభిప్రాయం మేరకు పునర్విభజన జరగలేదని ప్రజలు కోర్టును ఆశ్రయించారు.
● చీరాల మండలంలోని వాడరేవు పంచాయతీలో ఉన్న కీర్తివారిపాలేన్ని బోయినవారిపాలెంలో విలీనం చేశారు. దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆపంచాయతీలో కలపడంపై ఆగ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానానికి వెళ్లడంతో అక్కడా నిలిచిపోయాయి.
ఇవీ చదవండి:చీరాలలో దృష్ట సినిమా చిత్రీకరణ