ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురపాలికల్లో ఏలిక కోసం పావులు.. జాతరను తలపిస్తున్న వీధులు

పురపాలిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అగ్రనేతల కుటుంబసభ్యులు బరిలో ఉండడంతో కొన్ని స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. పోటా పోటీ ప్రచారంతో పుర వీధులు జాతర వాతవరణాన్ని తలపిస్తున్నాయి.

By

Published : Mar 4, 2021, 9:07 AM IST

campaign
పురపాలికల్లో ఏలిక కోసం పావులు.. జాతరను తలపిస్తున్న వీధులు

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో నామినేషన్ల ఘట్టం ముగియడంతో వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో నిమగ్నమవుతున్నారు. పట్టణంలో 28వార్డుకు 78 బరిలో ఉన్నారు. ఇక్కడ తెదేపా, వైకాపా అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలో నిలపగా.. జనసేన మూడు వార్డులు, భాజపా ఎనిమిది, సీపీఎం ఇద్దరిని పోటీలో ఉంచింది. తెదేపా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, ఆయన కుమారుడు రాజేష్ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడికి, అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్​కు మున్సిపాలిటీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.

అద్దంకిలో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం..

అద్దంకి మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గార్లపాటి శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక తెదేపా నేతలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ తెదేపా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పట్టణంలో నాలుగో వార్డులో సీపీఎం అభ్యర్థి తంగిరాల రజిని తరఫున జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ప్రచారం నిర్వహించారు.

ఇదీ చదవండి:

వైకాపాలో చేరికపై గంటా గతంలోనే ప్రతిపాదన పంపారు: విజయసాయిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details