ప్రకాశం జిల్లా కనిగిరిలోని దొరువు సమీపంలోని అంకాలమ్మ గుడి దగ్గర నివాసముంటున్న నామా వెంకటకృష్ణ, వెంకటేశ్వర్లు అన్నదమ్ములు. వీరికి కొంత కాలంగా ఆస్తి విషయంలో గోడవలు జరుగుతున్నాయి. తమ్ముడి దగ్గర తలిదండ్రులు ఉండడం వల్ల ఆస్తి మొత్తం వెంకటకృష్ణకు చెందుతుందని... అన్న వెంకటేశ్వర్లు తన తమ్ముడిపై కత్తితో దాడిచేశాడు. తండ్రి రమణయ్య ఫిర్యాదు మేరకు కనిగిరి ఎస్సై శివనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసం తమ్ముడిపై హత్యాయత్నం - కనిగిరి తాజా క్రైం వార్తలు
ఆస్తి కోసం తమ్ముడిని కత్తితో పొడిచిన ఘటన కనిగిరిలో జరిగింది. బాధితుడు వెంకట కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![ఆస్తి కోసం తమ్ముడిపై హత్యాయత్నం elder braother tries to kill his younger in prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7289481-531-7289481-1590072626934.jpg)
అన్న దాడిలో గాయపడ్డ తమ్ముడు వెంకట కృష్ణ