ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడిగుడ్లా... మరేదైనా పక్షి గుడ్లా..! - kanigiri latest news

కోడి గుడ్లా... చిన్న పిల్లలు ఆడుకొనే గోలిలా అన్నట్లుంది ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకంలో అందించే కోడిగుడ్ల పరిస్థితి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో తక్కువ బరువున్న గుడ్లను సరఫరా చేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెబుతున్నారు.

eggs in midday meal
మధ్యాహ్న భోజన పథకంలో అందించే కోడిగుడ్లు

By

Published : Nov 20, 2020, 3:40 PM IST

ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకంలో అందించే కోడిగుడ్లు

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలకు గుత్తేదారులు తక్కువ బరువున్న గుడ్లు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు అందించే కోడిగుడ్డు బరువు 40-50 గ్రాముల వరకు ఉండాలి. ప్రస్తుతం అందించే గుడ్లు చాలా చిన్నవిగా..గోలీల మాదిరిగా ఉంటున్నాయి. తీసుకునేందుకు విద్యార్థులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయం కావడంతో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు ఇంటి వద్దకే గుడ్లు పంపిణీ చేస్తున్నారు. 9,10 తరగతుల వారికి పాఠశాలలో భోజన సమయంలో అందిస్తున్నారు.

"గుత్తేదారులు అందించే గుడ్లు... ప్రభుత్వం నిర్దేశించిన బరువు కంటే తక్కువగా ఉంటున్నాయి. కొన్ని పాడైపోతున్నాయి... చెడిపోయిన వాటిని వెనక్కి పంపిస్తున్నాం కానీ..చిన్నవిగా ఉన్న గుడ్లు ఉపయోగిస్తున్నాం. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందించి నాణ్యతలో రాజీ పడకుండా గుడ్లను పంపిణీ చేయాలని కోరుతున్నాం" -భారతి దేవి, ప్రధానోపాధ్యాయురాలు, కనిగిరి.

ఇదీ చదవండి: తొమ్మిదేళ్లుగా ఏకధాటిగా పాలు ఇస్తున్న ఆవు!

ABOUT THE AUTHOR

...view details