క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు 'ఈనాడు' చేస్తున్న ప్రయత్నం హర్షనీయమని... చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి కొనియాడారు. చీరాలలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 పోటీలు ముగిశాయి. ఖోఖో, పరుగు పందెం, షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, చెస్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. విజేతలకు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారావు, కామాక్షి కేర్ ఆసుపత్రి ఎండీ తాడివలస దేవరాజులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లు ఈనెల 8వ తేదీ నుంచి జరగనున్న రీజనల్ పోటీలకు అర్హత సాధించాయి.
చీరాలలో ముగిసిన 'ఈనాడు' క్రీడా పోటీలు - eenadu sports league completed in chirala
ప్రకాశం జిల్లా చీరాలలో 'ఈనాడు' క్రీడా పోటీలు ముగిశాయి. విజేతలకు చీరాల మున్సిపల్ కమిషనర్ బహుమతులు అందజేశారు.
చీరాలలో ముగిసిన ఈనాడు లీగ్ అథ్లెటిక్స్ పోటీలు