ప్రకాశం జిల్లా చీరాలలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019 రీజనల్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సీనియర్ విభాగంలో నెల్లూరు, గుంటూరు జిల్లాల మధ్య జరిగిన పోటీలో నెల్లూరు బృందం 14 పరుగుల తేడాతో గెలుపొందింది. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో పశ్చిమ గోదావరి జిల్లా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. జూనియర్స్ విభాగంలో నెల్లూరు, కృష్ణా జిల్లాల జట్ల మధ్య పోటీ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈరోజు జరిగిన పోటీల్లో గెలుపొందిన జట్లు రేపు జరిగే ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.
చీరాలలో 'ఈనాడు' రీజనల్ స్థాయి క్రికెట్ పోటీలు - చీరాలలో ఈనాడు రీజినల్ స్థాయి క్రికెట్ పోటీలు
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019 రీజనల్ పోటీలు చీరాలలో జరుగుతున్నాయి. బ్యాట్‌తోనూ, బంతితోనూ క్రీడాకారులు రాణిస్తూ తమ జట్లను ఫైనల్స్‌కు చేర్చడంలో ముఖ్యపాత్ర పోషించారు.
చీరాలలో 'ఈనాడు' రీజనల్ స్థాయి క్రికెట్ పోటీలు