ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన తెలుగు వెలుగు జిల్లా స్థాయి పోటీలకు విశేష స్పందన లభించింది. బాలల దినోత్సవం పురస్కరించుకుని ఈనాడు హాయ్ బుజ్జి ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ఒంగోలు ఈనాడు నగర కార్యాలయంలో జరిగిన ఈ పోటీలకు 20 పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఉత్సాహంగా చిన్నారులను పోటీ పరీక్షకు తీసుకువచ్చారు. వీటిల్లో ప్రతిభ కనపరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లనున్నారు. ఈనాడు యాజమాన్యం ఇటువంటి పోటీ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభ వెలికి తీయటం హర్షించదగ్గ విషయమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారు.
తెలుగు -వెలుగు పోటీలకు విశేష స్పందన - kurnool eenadu hai bujji telugu velugu competitions news
బాలల దినోత్సవం పురస్కరించుకుని ఈనాడు హాయ్ బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు వెలుగు జిల్లా స్థాయి పోటీలకు విశేష స్పందన లభించింది. విద్యార్థుల్లోని ప్రతిభ వెలికి తీసే ఇలాంటి పోటీ పరీక్షలు నిర్వహించటం హర్షించదగ్గ విషయమని చిన్నారుల తల్లిదండ్రులు అన్నారు.
eenadu hai bujji telugu velugu competitions in kurnool
Last Updated : Nov 3, 2019, 11:33 PM IST