ప్రకాశం జిల్లా చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీలో ఈనాడు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. చీరాల గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, ఐకాన్ ఆసుపత్రి వైద్యుడు కొండలరావు వీటిని ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈనాడు చేస్తున్న కృషి అభినందనీయమని సీఐ శ్రీనివాసరావు అన్నారు. కళాశాలలోని రెండు మైదానాల్లో పోటీలు జరిగాయి. మొదటిరోజు మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి.
1. బి. ఏ అండ్ కె.ఆర్ డిగ్రీ కళాశాల ఒంగోలు, కె.ఆర్.కె డిగ్రీ కళాశాల అద్దంకి మధ్య జరిగిన పోటీలో 70 పరుగుల తేడాతో బి.ఏ అండ్ కె. ఆర్ జట్టు విజయం సాధించింది.
2. శ్రీ సాధన డిగ్రీ కళాశాల మార్కాపురంపై.. శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాల ఒంగోలు జట్టు 21 పరుగుల తేడాతో గెలుపొందింది.
3. ఎస్వీకేపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మార్కాపురం జట్టుపై అమృత డిగ్రీ కళాశాల మూలాగుంటపాడు గెలిచింది.
4. కృష్ణ చైతన్య డిగ్రీకళాశాల జట్టుపై గీతం డిగ్రీ కళాశాల ఒంగోలు జట్టు 3 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది.