ప్రకాశం జిల్లా చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 పోటీలు సందడిగా సాగుతున్నాయి. జట్ల మధ్య పోటీలు నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్నాయి. రెండు మైదానాల్లో ఆరు మ్యాచ్లు ఉత్కంఠభరితంగా జరిగాయి.
1. ఎస్.ఎస్.ఎన్ డిగ్రీ కళాశాల - ఒంగోలు, ఎన్.ఎన్.ఆర్ అండ్ సి.ఎల్ డిగ్రీ కళాశాల - ఒంగోలు మధ్య జరిగిన పోటీలో ఎస్.ఎస్.ఎన్ జట్టు విజయం సాధించింది.
2. శ్రీ నాగార్జున ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల - ఒంగోలు, క్వీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ - ఒంగోలు మధ్య జరిగిన హోరాహోరీ పోటీలో 38 పరుగుల తేడాతో క్వీస్ జట్టు జయకేతనం ఎగురవేసింది