Education Principal Secretary Praveen Prakash Inspections : ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం బాలుర గురుకుల పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల చదువులపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనిఖీలలో ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థుల పాఠ్యంశాలను పరిశీలించారు. ఎనిమిదో తరగతిలో విద్యార్థులకు వద్దకు వెళ్లిన ప్రవీణ్ ప్రకాశ్.. ఓ ఆంగ్ల ప్రశ్నకు నోట్స్ ఎంతమంది రాశారని ప్రశ్నించారు. ఎవరు రాయక పోవడంతో 5 నిమిషాలల్లో రాయాలని సూచించారు. చాలా మంది నిఘంటువులు లేవన్నారు. వేసవి సెలవుల్లో ఇంటికివెళ్లేటప్పుడు అప్పటి ప్రిన్సిపల్ నిఘంటువులు తీసుకుని.. తిరిగి ఇవ్వలేదని ఓ విద్యార్థి సమాధానమిచ్చాడు. అర్థం కాని పాఠ్యంశాలను ఇటీవల అందించిన ట్యాబ్లో పాఠాలను పునఃశ్చరణ చేసుకోవాలని సూచించారు.
విద్యార్థుల చదువులపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి అసంతృప్తి.. ఎందుకంటే..
Education Principal Secretary Inspections : ప్రకాశం జిల్లాలోని గురుకుల పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆయన అడిగిన ప్రశ్నలకు.. విద్యార్థులు ఇచ్చిన సమాధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఎమైందంటే..
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి తనిఖీలు
TAGGED:
గణపవరం బాలుర గురుకుల పాఠశాల