లాక్ డౌన్ తరువాత పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఆంక్షలు ముగియగానే.. పరిస్థితులకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేస్తామన్నారు. అంతవరకు విద్యార్థులు పరీక్షల ధ్యాసలోనే ఉండే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోమని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో స్థానిక వైకాపా నేతలు సమకూర్చిన నిత్యావసర సరుకులను మంత్రి.. పేదలకు పంపిణీ చేశారు. సాయానికి ముందుకు వచ్చిన వారిని అభినందించారు.
లాక్ డౌన్ తరువాత పది పరీక్షలు: మంత్రి సురేశ్
లాక్ డౌన్ తరువాత పదో తరగతి పరీక్షలు నిర్వహించే అంశంపై దృష్టి సారిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
minister suresh statement on conduct of SSC examinations