రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉపాద్యాయుల బదిలీల ప్రక్రియపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులను భర్తీ చేసేందుకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ చేపట్టామన్నారు. ఇవాళ ఉదయం 11.45 నిమిషాల వరకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేసుకునేందుకు చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉండగా... నెల్లూరు చివరి స్థానంలో ఉందన్నారు. బదిలీల ప్రక్రియ నేటితో ముగియనుండగా.. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు రేపటి వరకు సమయాన్ని పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పొడిగింపు: మంత్రి సురేశ్ - teachers transfers date extend in ap news
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను రేపటి వరకు పొడిగిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. బదిలీల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
minister suresh