ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ నెల 14న నాడు-నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ అన్నారు. పాఠశాల విద్యలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు విద్యాబోధనల్లో సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు, పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్లమాధ్యమంలోకి అడుగిడుతున్నామన్నారు. 2021-22లో 9వ తరగతి, 2022-23లో 10వ తరగతిలో ఆంగ్లంను ప్రవేశ పెట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల పాఠశాలల్లో మొత్తం ఆంగ్లంలో బోధన నిర్వహిస్తామన్నారు. అదే విధంగా వచ్చే ఏడాది 1 నుంచి 5 వరకూ పాఠ్యపుస్తకాలు కూడా మారుస్తున్నామని అన్నారు. ఒక్కసారిగా మాధ్యమంలోకి మారడం వల్ల తలెత్తే ఇబ్బందులను అధిగమిస్తామని, తమిళనాడులో కూడా ఆంగ్లమాధ్యమానికి మారారని, అక్కడ ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణను మోడల్‌గా తీసుకుని జనవరి నుంచి రాష్ట్రంలో ఉన్న 90 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని రాజశేఖర్ అన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రానున్న మూడేళ్లలో 10 వేల కోట్ల రూపాయలతో 45వేల పాఠశాలలను అభివృద్ధి పరుస్తామన్నారు.
'వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం' - education commissioner talks about nadu nedu flagship programme
పాఠశాల విద్యలో సమూల మార్పుల తీసుకువచ్చేందుకు సంస్కరణలు చేపడుతున్నామని ఒంగోలులో పర్యటించిన పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ అన్నారు.
'వచ్చే ఏట నుంచి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు'