దణ్ణం పెడతానమ్మా... ప్లీజ్ ఇంటికి వెళ్లిపోండి... మీ మనోభావాలు దెబ్బతీయటానికి కాదు... దయచేసి ప్రస్తుత పరిస్థితి అర్థం చేసుకోండి.. ఇళ్లల్లోనే పండగను నిర్వహించుకోండి అని ఓ పోలీసు ఓ మహిళను ఇంటికి వెళ్లమని బతిమాలుతున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది.
'ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోండి... మాకు సహకరించండి' - చీరాలలో ఈస్టర్ ప్రార్థనలు
ఈస్టర్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు సమాధుల వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు. సమాధుల వద్దకు కుటుంబసభ్యులు అధిక సంఖ్యలో వస్తే కరోనా మహమ్మారి ప్రబలే అవకాశం ఉండటంతో తెల్లవారుజాము నుంచే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఈస్టర్ సందర్భంగా సమాధుల వద్దకు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో వస్తారనీ, ప్రజలు గుంపులుగా చేరితే ప్రమాదమని భావించిన పోలీసుల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చీరాలలో తెల్లవారుజాము నుంచే పోలీసులు క్రైస్తువుల సమాధుల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమాధులను అలంకరించేందుకు వస్తున్న వారిని వెనక్కి పంపిస్తున్నారు. మీకు దండం పెడతాం ఇంటికి వెళ్లిపోండని నమస్కరిస్తున్నారు. లాక్డౌన్ను పాటిస్తూ, ఇళ్లల్లోనే ఈస్టర్ పండుగను జరుపుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:'ఉదయం 6 నుంచి 9 వరకే చికెన్ విక్రయం'