కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన విశాల డ్వాక్రా సంఘం సభ్యులు ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్ ధనలక్ష్మిని కలిశారు. గ్రూప్ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి రుణం తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో పనిచేసే వీవోఏలు, వెలుగు సిబ్బంది చొరవతోనే ఈ రుణం పొందారని మహిళలు ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రావాల్సిన రుణం నగదు ఇప్పించాలని డ్వాక్రా మహిళలు కోరారు.
'సంతకాలు ఫోర్జరీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి' - dwacra ladies given letter to medarametla village
మేదరమెట్ల గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘం సభ్యులు ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌ను కలిశారు. గ్రూప్ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమెను కోరారు.
!['సంతకాలు ఫోర్జరీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి' dwacra ladies given letter to medarametla village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9244184-370-9244184-1603185334132.jpg)
ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేసిన డ్వాక్రా మహిళలు