ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా అక్కతో.. అలా ఉంటున్నందుకే చంపేశా!' - ప్రకాశం జిల్లా దర్శి తాజా క్రైం వార్తలు

రామస్వామి అనే వ్యక్తి తన అక్కతో సహజీవనం చేస్తున్నాడనే కారణంతోనే చంపేశాడు బావమరిది దామా సుబ్బారావు. అనంతరం గ్రామ పెద్ద మనుషులు, వీఆర్వోల సమక్షంలో లొంగిపోగా... పోలీసులు కేసు నమోదు చేశారు.

due to sister illegal affair her brother killed a person and surrendered in village officials in darsi constituency
ప్రెస్​మీట్​లో మాట్లాడుతున్న దర్శి డీఎస్పీ ప్రకాశ్​రావు

By

Published : May 23, 2020, 4:18 PM IST

ప్రకాశం జిల్లా దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెం గ్రామంలో.. రామస్వామి అనే వ్యక్తి హత్య కేసు వివరాలను పోలీసులు వివరించారు. రామస్వామి రాత్రి గొర్లదొడ్డి వద్ద పడుకుని ఉండగా.. వరసకు బావమరిది అయిన దామా సుబ్బారావు రోకలి బండతో మొహంపై బాది చంపేసినట్టు చెప్పారు. ఆ వెంటనే లొంగిపోయినట్టు డీఎస్పీ ప్రకాశరావు తెలిపారు.

రామస్వామి.. తన అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. అందుకే చంపేశానని నిందితుడు చెప్పాడన్నారు. గ్రామ పెద్దలు, వీఆర్వో కలిసి సుబ్బారావును తమకు అప్పగించినట్టు చెప్పారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details