Sapota farmers struggle : ప్రకాశం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు సపోటా రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. కొన్నేళ్లుగా నష్టాల బారిన పడుతున్న సాగుదారులకు ఈ నష్టం.. మరిన్ని కన్నీళ్లను మిగిల్చింది. దీంతో.. చాలా మంది రైతులు తోటలు కొట్టేసి ఇతర పంటల వైపు చూస్తున్నారు.
జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో సపోటా సాగుచేస్తుండగా.. ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోనే.. దాదాపు ఏడు వేల ఎకరాల్లో సపోటా తోటలు ఉన్నాయి. ఇక్కడ పండే పండ్లు హైదరాబాదు, చెన్నై, నెల్లూరు, విజయవాడ , పొద్దుటూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.