ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఓటమి భయంతోనే రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నారు' - prakasam dst election issues

ఓటమి భయంతోనే వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు చేస్తోందని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. పెద్దగంజాంలో తెదేపా అభ్యర్థి ఇంటిముందు వైకాపా నాయకులే మద్యం సీసాలు పెట్టి పోలీసులకు సమాచారమిచ్చారని ఆరోపించారు.

due to fear of loose in elections ycp leaders attack on tdp candidates
వైకాపా నాయకులు దౌర్జన్యాలను చెపుతున్న ఎమ్మెల్యే

By

Published : Mar 13, 2020, 7:39 PM IST

వైకాపా నాయకుల దౌర్జన్యాలను వివరిస్తున్న ఎమ్మెల్యే

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందర్భంగా వైకాపా బెదిరింపులకు పాల్పడుతోందని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సర్కారు రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు. చిన్నగంజాంలో తెదేపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన... తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెదేపా అభ్యర్థులను వైకాపా భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. పెద్దగంజాంలో తెదేపా అభ్యర్థి ఇంటిముందు మద్యం సీసాలను వైకాపా వాళ్లు ఉంచి పోలీసులకు చెప్పి అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైకాపాను ఎలా ఎదుర్కోవాలో కార్యకర్తలకు సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details