ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ తీగ తగిలి... తెగిపడిన మహిళ తల - women died due to current shock news in prakasam dst

కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే ఆ వివాహితకు విద్యుత్ తీగే యమపాశమైంది. తలను తెగనరికి ప్రాణాలు తీసుకెళ్లింది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల ఏబీఎం పాలెంలో ఈ ఘోరం జరిగింది.

due to current shock a women died in prakasam dst
due to current shock a women died in prakasam dst

By

Published : May 26, 2020, 7:40 AM IST

ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల ఏబీఎం పాలెంలో ఓ గృహానికి స్లాబ్ వేసే క్రమంలో 11కేవీ విద్యుత్ తీగలు తగిలి శ్యామలత అనే మహిళ తల తెగిపడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

శ్యామలత భర్త ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో ఉన్నాడు. వారికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది శ్యామలత. ఆమె మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details