లాక్డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కూలీలకు ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ముస్లిం సోదరులు... 80 రోజులుగా ఆహారం అందిస్తున్నారు. నిరంతరం వలస కూలీల, యాచకులు, నిరాశ్రయులు, పేదవారు, వికలాంగులకు భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు. వీరు చేస్తున్న సేవకు కంభం తహసీల్దార్... పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించారు. సహాయం అందించడానికి గొప్ప ధనవంతులు కానక్కర్లేదని... మంచి మనసు ఉంటే చాలన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి కొందరు సేవా కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలని కోరారు.
ముస్లిం సోదరులను సత్కరించిన తహసీల్దార్
లాక్డౌన్తో కంభంలో ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులకు... ముస్లిం సోదరులు చేయూతనందిస్తున్నారు. వారు చేస్తున్న సేవలను కొనియాడుతూ... స్థానిక తహసీల్దార్ పూలమాలలతో సత్కరించారు.
ముస్లిం సోదరులను సత్కరించిన తహసీల్దార్