ప్రకాశం జిల్లా ఒంగోలులో పారిశుద్ధ్య సిబ్బందికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఒంగోలు - కర్నూలు రోడ్డులో ఉన్న బ్యాంకు ఆవరణలో దాదాపు 200 మందికి.. రీజనల్ మేనేజర్ కృష్ణ మోహన్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మెప్మా పీడీ కృపారావులు వారికి బియ్యం, వంటనూనె, పప్పులు తదితర వస్తువులు అందజేశారు.
ఒంగోలులో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - ప్రకాశం పారిశుద్ధ్య కార్మికుల వార్తలు
కరోనా వ్యాప్తి నియంత్రణకు నిరంతరం శ్రమిస్తోన్న పారిశుద్ధ్య సిబ్బందికి దాతలు సహాయం అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో వారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
due to corona lockdown Distribution of essential commodities for sanitation workers at ongole in prakasham