ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రజలు జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. గాంధీ బొమ్మ సెంటర్, వైఎస్సార్ సెంటర్, బస్, రైల్వే స్టేషన్, అమ్మవారి శాల వీధి, పొట్టి శ్రీరాములు సెంటర్లు జనాలు లేక నిశ్శబ్దంగా మారాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బంగారం, వస్త్ర, వ్యాపార దుకాణాలను మూసివేశారు.
గిద్దలూరులో స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ - due to corona Janata curfew continues at giddhaluru
గిద్దలూరులో జనతా కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లలోనే స్వచ్ఛందంగా కర్ఫ్యూని కొనసాగిస్తున్నారు. ఈ మేరకు వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
due to corona Janata curfew continues at giddhaluru in prakasham district