ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వండి' - dsc protest in prakasam district latest news

డీఎస్సీ 98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలో డీఎస్సీ అభ్యర్ధులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కు కూడా వినతిపత్రం అందజేశారు.

NIRASANA
NIRASANA

By

Published : Jun 16, 2021, 8:19 AM IST

పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించాలని.. 1998 డీఎస్సీ అభ్యర్థులు గడియార స్తంభం కూడలి వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. ముందుగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. గత 22 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు బాబు, అలీ, వెంకటేశ్వర్లు, హుస్నారా, సత్యం, రత్నబాబు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ జానీబాషా, పట్టణాధ్యక్షుడు రాజేష్‌, జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్రా రామారావు తదితరులు మద్దతు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details