ప్రకాశం జిల్లా అద్దంకిలో మద్యం దుకాణం వెనకే మందుబాబుల దర్జాగా కూర్చుని తాగేస్తున్నారు. కోరుకుంటే మద్యం సీసాలు అక్కడికే సరఫరా అవుతున్నాయి. గ్లాసులు, మంచినీళ్ళు, శీతలపానీయాల వంటి వాటిని మందుబాబులకు తెచ్చి ఇస్తున్నారు.సెలవుల సమయంలో వీరి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. రోడ్డెక్కి వీరంగం సృష్టిస్తున్నారు. వీరికి సమీపంలోని హోటల్ నిర్వాహకులు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో మాకేం పని.. దుకాణం వెనుకే కానీ కానీ! - liquior news at news at prakasam dst
మద్యాన్ని దశలవారీగా నిషేధించే క్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే దుకాణాలను ఏర్పాటు చేసి నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పర్మిట్ రూములను తొలగించారు. మద్యం తాగేవారు దుకాణాల్లో కొనుగోలు చేసి వేరే చోటకు తీసుకు వెళ్లి తాగాల్సి ఉంది. కానీ.. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది.
దుకాణం వెనుకే మద్యంతాగుతున్న మందుబాబులు